శరన్నవరాత్రి మూడో రోజు భక్తులకు అన్నదానం నిర్వహించిన రామగిరి గంగమ్మ ఆలయ నిర్వాహకులు
శరన్నవరాత్రి మూడో రోజు భక్తులకు అన్నదానం నిర్వహించిన రామగిరి గంగమ్మ ఆలయ నిర్వాహకులు..
రామగిరి మేజర్ న్యూస్: రామగిరి మండల కేంద్రంలో వెలసి ఉన్న గంగమ్మ తల్లి ఆలయంలో మంగళవారం అమ్మవారి శరన్నవరాత్రి పూజల్లో భాగంగా మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో గంగమ్మ అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నపూర్ణ దేవి భక్తులకు ఎంతో ఇష్టమైన దేవత. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శరన్నవరాత్రులు పూజల్లో భాగంగా అమ్మవారు ప్రతిరోజు ఒక కొత్త అలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అని ఆలయ పూజారి తెలిపారు.