శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ఆశీస్సులతోనే కలిదిండి మండలం జడ్పిటిసి
శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ఆశీస్సులతో కలిదిండి మండలం జడ్పిటిసి అభ్యర్థిగా నల్ల గోపుల వెంకట చలపతి కూటమి నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వెంకట చలపతి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో కార్యకర్తలు కృషితో అఖండ మెజార్టీతో గెలుపొందాలని కోరారు. మండలంలోని ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అందుబాటులో ఉండి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల ఐక్యమత్యంతో కూటమి జెండా ఎగరవేస్తానని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారాలు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. నాపై నమ్మకంతో జడ్పిటిసి అభ్యర్థిగా కేటాయించనందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకుడు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్. ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా