BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

సేవా స్ఫూర్తికి ప్రతీకగా యూత్ టైం బ్యాంక్

Select Suryaa Now
సేవా స్ఫూర్తికి ప్రతీకగా యూత్ టైం బ్యాంక్

విజ‌య‌వాడ‌, మేజర్ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలు విజయవంతంగా 200 రోజులు పూర్తి చేసుకోవడం అభినందనీయమని యూత్ టైం బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జిల్లా పర్యాటక, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల స‌మ‌న్వ‌య అధికారి డా. కొల్లేటి రమేష్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 17న విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రారంభించిన ఈ సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. వివిధ కళాశాలలకు చెందిన జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) వాలంటీర్లు ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, అంధులు, నిరక్షరాస్యులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలోనే వినూత్నంగా ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం విజయవాడ జీజీహెచ్‌లో 200 రోజులపాటు నిరంతరంగా కొనసాగడం విశేషమని కలెక్టర్ డా. లక్ష్మీశ అభినందించారు. యూత్ టైం బ్యాంక్ 200వ రోజు సేవల్లో భాగంగా విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సేవలందించారు. ఈ సందర్భంగా వాలంటీర్లతో పాటు ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి, కళాశాల ప్రిన్సిపల్‌ను కలెక్టర్ అభినందించారు. యూత్ టైం బ్యాంక్ వాలంటీర్లు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆన్‌లైన్‌లో ఓపీ నమోదు చేయడం, వైద్యులను సంప్రదించడంలో సహకరించడం, వైద్య పరీక్షలు చేయించడం, మందులు పొందడంలో సహాయం చేయడం వంటి సేవలను అందిస్తున్నారు. ఇప్పటివరకు యూత్ టైం బ్యాంక్ ద్వారా 5,169 మంది వాలంటీర్లు సేవలందించగా, మొత్తం 20,076 గంటల సమయాన్ని ప్రజాసేవకు వెచ్చించారు. ఈ సేవల ద్వారా 12,338 మంది రోగులకు సహాయం అందించినట్లు డా. కొల్లేటి రమేష్ వివరించారు. ఈ సేవా కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు స్వచ్ఛంద సంస్థలు, విశ్రాంత ఉద్యోగులు, ఆసక్తి గల యువత, ఇతర సేవాభిలాషులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు. సేవల్లో భాగస్వాములు కావాలనుకునేవారు యూత్ టైం బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డా. కొల్లేటి రమేష్‌ను 9487916504 నంబ‌రులో సంప్ర‌దించ‌వ‌చ్చ‌న్నారు. 200వ రోజు కార్యక్రమంలో జీజీహెచ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ రామారావు, చంద్రశేఖర్ రెడ్డి, జాఫర్, విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి రియాన్, వాలంటీర్లు, వాసవ్య మహిళా మండలి వాలంటీర్ అనిత తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.