సేవా సంకల్పం కార్యక్రమానికి ఎంపికైన పాలకొండ విద్యార్థిని
పాలకొండ: పాలకొండ పట్టణంలోని హడ్కో కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కుప్పిలి గీతిక రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న సేవా సంకల్పం కార్యక్రమానికి ఎంపికైంది. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రతిభను అభినందిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. గీతిక భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.