BREAKING
మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం ఎల్ నినో సమర్థవంతం ఎదుర్కొందాం రామాపురంలో పల్లెపండుగ ఏర్పాట్లు పరిశీలన మహిళల భద్రతే ధ్యేయం.. శక్తి యాప్‌పై విస్తృత అవగాహన వడ్డెరల భూములకు రక్షణ కల్పించండి సారూ..! ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని విద్యార్థుల కల్పించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి* నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో అదిరిపోయే ట్విస్ట్.. సెకండ్ హాఫ్‌లో బాలయ్య సర్ప్రైజ్? రామాపురం పల్లెపండుగ జయప్రదం చేయండి పల్లెపండుగ 3.0 కార్యక్రమం విజయవంతం చేయాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గ్రామ పంచాయితీ ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సేవలు అభినందనీయం సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి 13 ఏళ్ల ఫర్హాన్‌ ఎక్కడ? ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా టెక్కలి జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

Select Suryaa Now
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా టెక్కలి జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

 

టెక్కలి మేజర్ న్యూస్:28
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టెక్కలి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, మహిళా నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలిచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. యువతతో పాటు ప్రజలు కూడా సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని సామాజిక బాధ్యతను చాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టెక్కలి బీజేపీ మండల అధ్యక్షులు జర్జాన రాంజీ, నియోజకవర్గ బీఎల్‌ఏ-1 అట్టాడ రవి బాబ్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, సేవా సంకల్ప అభియాన్ నియోజకవర్గ ఇన్‌చార్జి తమ్మినేని ఆనందరావు, రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షులు బూర నరేంద్ర, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు జర్నీ పరమేశ్వర్, జిల్లా కార్యదర్శి జన్నీ కుమారి, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవేణి, జిల్లా స్వచ్ఛభారత్ కన్వీనర్ లింగరాజు, మండల ఉపాధ్యక్షులు ఆకుల ప్రకాష్, ఒడిశా బాబురావు, నందిగాం మండల అధ్యక్షులు కామరాజు, సోషల్ మీడియా ప్రతినిధులు మురళీకృష్ణ, అవినాష్, కిషోర్, ఏబీవీపీ మదన్, సోమేశ్వరరావు, డాక్టర్ సునీత, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.