BREAKING
చైనా సంస్థల కొనుగోలుకు ఇటలీలో ఉత్పాదక ప్లాంట్లు అందుబాటులో లేవు వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా ఐసీఐసీఐ లంబార్డ్ త్రైమాసిక ఫలితాల జోరు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లలో 47 శాతం ర్యాలీకి అవకాశం: ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో ‘బై’ రేటింగ్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేఎండీఎస్ ట్యాంక్ తయారీ సంస్థలో జర్మనీ ప్రభుత్వం భారీ వాటా కొనుగోలు దిశగా చర్చలు నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం. మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి! ఉద్యాన పంటల పథకాల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోండి

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

Select Suryaa Now
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

వింజమూరు మేజర్ న్యూస్ :    వింజమూరు పంచాయతీ పరిధిలోనియర్రబెల్లిపాలెం ధ్యాన మందిరం వద్ద మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు మండలకన్వీనర్ గూడానరసారెడ్డిఆధ్వర్యంలో,పీఆర్ఏఈతిరుమలయ్యపర్యవేక్షణలోజరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధ్యాన మందిరం సమీపంలో రెండు చోట్ల రూ.5 లక్షలు చొప్పున మొత్తం రూ.10 లక్షల వ్యయంతో 280 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సీసీ రోడ్డు నిర్మాణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతుందని తెలిపారు. అలాగే సమీపంలోని మోట చింతలపాలెం ఎస్సీ కాలనీలో రూ.3 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  అనంతరం మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రతి ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా పాలన అందిస్తున్నారని, ఇప్పటికే మారుమూల గ్రామాలకు సైతం లక్షలాది రూపాయల నిధులను మంజూరు చేయించి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అభివృద్ధే తారక మంత్రంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రెండు రోజుల్లో నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులుగూడా నవీన్ రెడ్డి ఎన్నపల్లి పెంచలరావు మరియు  ఆ ప్రాంత నాయకులు తదితరులు పాల్గొన్నారు.