BREAKING
హిమాచల్ ప్రదేశ్‌లో రైతులకు తీపి కబురు: ఆపిల్ సేకరణ ధర పెంపు వ్యాపారులకు ఊరట: యూపీఐ లావాదేవీలపై 0.28% ఎండీఆర్ మాఫీని పరిశీలిస్తున్న ఇండియన్ బ్యాంక్.. ఎండీ & సీఈవో బినోద్ కుమార్ వెల్లడి! ‘ఇన్వెస్ట్ మహారాష్ట్ర’ వేదిక ప్రారంభం: ₹8.57 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా.. ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం అమెరికా లేబర్ మార్కెట్‌లో జోరు: జూలై తర్వాత కనిష్టానికి నిరుద్యోగ క్లెయిమ్‌లు.. 1.97 లక్షలకు క్షీణత! ‘ఆ అనుభూతిని మళ్లీ ఆస్వాదించాలనుంది’: ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం

సత్తప్ప నాయుడు సేవలు అభినందనీయం కేఎంసి కమిషనర్ సత్యనారాయణ

Select Suryaa Now
సత్తప్ప నాయుడు సేవలు అభినందనీయం కేఎంసి కమిషనర్ సత్యనారాయణ

సత్తప్ప నాయుడు సేవలు అభినందనీయం

పదవీ విరమణ సందర్భంగా ఘన సత్కారం

నిబద్ధతతో విధులు నిర్వర్తించారన్న కమిషనర్‌ సత్యనారాయణ

కాకినాడ, సెప్టెంబరు 30: కాకినాడ నగరపాలక సంస్థలో శానిటేషన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన జి.సత్తప్ప నాయుడును అధికారులు, ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో అదనపు కమిషనర్‌ కే.టి.సుధాకర్‌ అధ్యక్షతన మంగళవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

కమిషనర్‌ ఎన్‌.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ నగర పారిశుద్ధ్య నిర్వహణలో సత్తప్ప నాయుడు నిబద్ధతతో పనిచేశారని, ఆయన సేవలు అభినందనీయమన్నారు. ఉద్యోగులు ప్రజాసేవను బాధ్యతగా భావించి విధులు నిర్వర్తించాలని సూచించారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. అదనపు కమిషనర్‌ సుధాకర్‌ ఆయన సేవలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో తాడేపల్లిగూడెం కమిషనర్‌ ఏసుబాబు, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పృథ్వీచరణ్‌, డిప్యూటీ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌, ముమ్మిడివరం కమిషనర్‌ వర్మ, ఎస్‌ఈ పి.వెంకట్రావు, ఈఈలు కనకారావు, మాచరాజు, శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ రాంబాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కార్పొరేషన్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.