సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమంగా బయటకు
ముత్తుకూరు , మేజర్ న్యూస్ : రాష్ట్రంలోని చీరాల మండలం ఓడరేవు గ్రామానికి చెందిన ఐదు మంది మత్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి తుఫాను ప్రభావంతో చిక్కుకుపోయి బోటు బోల్తా పడి ఇబ్బందులు పడుతున్న తరుణంలో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ తో పాటు తమిళనాడు మత్స్యకారులు సురక్షితంగా వారందరిని సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చారు. మంగళవారం అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. రక్షించబడిన వారిలో రమణ, అప్పారావు, జగన్నాథం, పోలరాజు, కొండయ్య ఉన్నారని అధికారుల పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది