BREAKING
థాంగ్‌-టా మార్షల్ ఆర్ట్స్‌లో పార్వతీపురం మన్యం జిల్లా క్రీడాకారుల ప్రతిభ.. కీర్తన, పవినాయ్‌కు బంగారు పతకాలు డిసి యూనివర్స్‌లోకి ప్రవేశించడం వెనుక కఠినమైన ఆడిషన్స్.. హాలీవుడ్ నటి నయోమి ఆకీ ఆసక్తికర విషయాలు! అన్నపూర్ణాదేవి అవతారంలో పోలమాంబ దర్శనం భూగర్భ జలాలు పడిపోవడంతో లాతూర్‌లో నీరు, పశుగ్రాసం ప్రణాళికలు సిద్ధం చేసిన యంత్రాంగం! ఆ 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే చేర్చుకోండి: విజయేంద్ర వ్యాఖ్యలపై డీకే శివకుమార్ కౌంటర్! స్ట్రైక్ రేట్ 100% పక్కా! - వైజాగ్ జనసేనలో స్థానిక ఎన్నికల జోష్ అశ్వారావుపాలెం అభివృద్ధికి రూ.54.60 లక్షలు - పేదలకు భరోసాగా పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారు: నాగబాబు కరువు నివేదికలు పక్కాగా తయారు చేయండి - వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా ఆదేశం - 35,446 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా బాలల భీమాకు టీడీపీ మండల కన్వీనర్ గుత్తా శ్రీనివాసులు నాయుడు విరాళం బడి బాగుంటేనే భావితరాలకు భరోసా డైరీ ఫారం వద్ద దసరా శరన్న నవరాత్రి ఉత్సవాలు కోర్టు ప్రాంగణాల్లో రాజకీయ ఆందోళనల నిషేధంపై అక్టోబర్ 15న సుప్రీంకోర్టు విచారణ! సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన..!! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను నిలిపివేయాలి: తొలగించిన అర్హుల పేర్లను పునరుద్ధరించాలని కాంగ్రెస్ డిమాండ్! ఆనందపురం జంక్షన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన....

రుయాలో కోటితో అదనపు క్యాజువాలిటీ బ్లాక్ -జెఎంసి ట్రస్ట్ 50 లక్షలు, కలెక్టర్ నిధుల నుండి 50 లక్షలు మంజూరు -భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆరణి, జిల్లా కలెక్టర్

Select Suryaa Now
రుయాలో కోటితో అదనపు క్యాజువాలిటీ బ్లాక్ -జెఎంసి ట్రస్ట్ 50 లక్షలు, కలెక్టర్ నిధుల నుండి 50 లక్షలు మంజూరు  -భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆరణి, జిల్లా కలెక్టర్

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రుయా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేసేందుకు రూ.కోటి వ్యయంతో 15 పడకల అదనపు ఎమర్జెన్సీ బ్లాక్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. మంగళవారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, సంయుక్తంగా ఆసుపత్రి ప్రాంగణంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ బ్లాక్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆరణికి చెందిన జెఎంసి ట్రస్ట్ నుండి రూ.50 లక్షలు, మిగిలిన రూ.50 లక్షలను జిల్లా కలెక్టర్ నిధులు, ఆసుపత్రి అభివృద్ధి సంఘం, వైద్య కళాశాల అభివృద్ధి సంఘం, ఎన్టీఆర్ వైద్య సేవ నిధుల సమన్వయంతో సమకూర్చారు. సీఎం సూచించిన పి-4 విధానంలో ప్రజా భాగస్వామ్యంతో ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం క్యాజువాలిటీలో 25 పడకలు మాత్రమే ఉండగా, రోజుకు సుమారు 300 మంది రోగులు అత్యవసర వైద్యం కోసం వస్తున్నారని, ఒక్కో పడకపై 2-3 మందికి చికిత్స అందించాల్సి వస్తోందని ఎమ్మెల్యే, కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో క్రిటికల్ కేర్ బ్లాక్‌లో 100 పడకల ప్రణాళిక ఉన్నా, అది 3-4 ఏళ్లు పడుతుందని, అందుకే తక్షణ అవసరాల కోసం ఈ 15 పడకల బ్లాక్‌ను 4-5 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సకాలంలో వైద్యం అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, రుయా సూపరింటెండెంట్ మనోహర్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ బిజెపి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, హెచ్ డి ఎస్ సభ్యులు బండ్ల లక్ష్మీపతి, మునస్వామి, సందీప్, ఖాజా మొహిద్దిన్ పాల్గొన్నారు.

 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్