BREAKING
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి.. మాజీ ఎంపీ బెల్లాన్ని చంద్రశేఖర్ పలువురిని పరామర్శించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అండగా ఉంటామని భరోసా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకిలో నిరసన. యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం

రూ.37.65 కోట్లతో అభివృద్ధి పనులు... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

Select Suryaa Now
రూ.37.65 కోట్లతో అభివృద్ధి పనులు...  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

శ్రీకాకుళం, సూర్య : శ్రీకాకుళం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సుమారు రూ.37.65 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నగరంలో నిర్వహించిన భారీ బైక్‌ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. పార్టీ శ్రేణులు, యువత నాయకులకు ఘన స్వాగతం పలికారు.

విద్యారంగానికి ప్రాధాన్యం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే లక్ష్యంతో పలు పనులను ప్రారంభించారు. ఏవీఎన్‌ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో రూ.1.11 కోట్లతో ఏర్పాటు చేసిన ఏసీ ఆడిటోరియం, గ్రంథాలయం, ఆటిజం సెంటర్, ఏఐ, రోబోటిక్స్ ల్యాబ్‌, భోజనశాలను అందుబాటులోకి తెచ్చారు. ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో రూ.85 లక్షలతో ఏర్పాటు చేసిన జిల్లా సైన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ఎచ్చెర్ల వీధి ప్రాథమిక పాఠశాలలో రూ.30 లక్షలతో చేపట్టిన భవన మరమ్మతులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రారంభించారు.

రహదారులు, డ్రైనేజీల అభివృద్ధి

నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, పారిశుధ్యం, మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు చేపట్టారు. పొట్టి శ్రీరాములు జంక్షన్‌ నుంచి అరసవల్లి జంక్షన్‌ వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (HAM) కింద రూ.3 కోట్లతో చేపట్టనున్న రహదారి మీడియన్‌ పనులకు శ్రీకారం చుట్టారు. డీసీసీబీ కాలనీలో రూ.49.90 లక్షలు, పుణ్యపు వీధిలో రూ.32.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. వుడా లేఅవుట్‌లో రూ.27.60 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు, సోడా లేఅవుట్‌లో రూ.26.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, శాంతినగర్ కాలనీలో రూ.13 లక్షలతో పూర్తిచేసిన సీసీ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. రిమ్స్‌ రోడ్డు, హడ్కో కాలనీ ఎలిమెంటరీ స్కూల్‌ వద్ద రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

సామాజిక అవసరాలకు ప్రాధాన్యం

ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోటి రూపాయలతో నిర్మించిన డీసీఎంఎస్‌ కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. రిమ్స్‌ ఆసుపత్రి ప్రాంగణంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాఫీ కేఫ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు ప్రోత్సాహం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాకుళం నగర రూపురేఖలను మార్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపట్టి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.