BREAKING
సత్యదేవ్, ఫరియా 'ట్రయల్ అండ్ ఎర్రర్'.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం! ఫిర్యాదు పరిష్కారమైతే సరిపోదు.. ప్రజలు సంతృప్తి చెందాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న శ్రీకాళహస్తి డిఎస్పి వరుణ్ సందేశ్ ‘కాస్ట్’ టీజర్ విడుదల.. హింసాత్మక, తీవ్రమైన డ్రామాగా సరికొత్త చిత్రం! పోలీసుల వేధింపులు తాళలేక… ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి విజయదుర్గమ్మ వారి దేవి నవరాత్రుల ఉత్సవాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలి రాయదుర్గం కాంగ్రెస్‌లో భారీ చేరికలు గౌని ప్రతాపరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన 26 కుటుంబాలు కాట్రేనికోనలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. టాలీవుడ్‌లోకి శ్రీకాంత్ కూతురు ఎంట్రీ.. హీరోయిన్‌గా అరంగేట్రం చేయనున్న మేధ! -బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన జగత్ జాననీ ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలకు ఫుల్‌స్టాప్‌ రక్షణ సామగ్రితో సన్నద్ధమైన జిల్లా పోలీస్ యంత్రాంగం ‘వజ్ర’ వాహనాలు, డ్రోన్లు, రక్షణ కవచాల తనిఖీ ఎన్నికల ప్రశాంత నిర్వహణే లక్ష్యం: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఘనంగా వైఎస్సార్‌సీపీ నూతన బీసీ, మైనారిటీ నేతల సన్మానం: పార్టీ పటిష్టతకు కృషి చేయాలని బొంతు సత్య శ్రీనివాస్ పిలుపు! శారీలో తళుక్కుమన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. క్యూట్ లుక్స్‌తో నెట్టింట పిక్స్ వైరల్! ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యం ఖూనీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.సాకే హరి

రెండేళ్ల నాలుగు నెలల్లో ఒక్క రూపాయి కరెంట్ బిల్లు పెంచలేదు స్థానిక పోరులో టీడీపీ, కూటమి అభ్యర్థులను గెలిపించాలి - ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

Select Suryaa Now
రెండేళ్ల నాలుగు నెలల్లో ఒక్క రూపాయి కరెంట్ బిల్లు పెంచలేదు  స్థానిక పోరులో టీడీపీ, కూటమి అభ్యర్థులను గెలిపించాలి   - ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

రేపల్లె, మేజర్‌న్యూస్‌ - ప్ర‌జా సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌డ‌మే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రేపల్లె ప‌ట్ట‌ణంలో ఆదివారంనాడు స‌హ‌చ‌ర మంత్రులు కొలుసు పార్థ‌సార‌ధి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్ తో క‌లిపి ప‌ర్య‌టించిన ఆయ‌న వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. రూ.144 కోట్ల రూపాయిల విలువైన అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేయ‌డంతో పాటు ప్రారంభోత్సాలు నిర్వ‌హించారు. రేపల్లె పట్టణంలో విద్యుత్ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు రూ.56.76 కోట్లతో చేపట్టనున్న హై లెవెల్ ఎలక్ట్రికల్ టవర్స్ తో చేపట్టే  నిర్మాణానికి మంత్రి గొట్టిపాటి త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిపి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. రేప‌ల్లె ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కూట‌మి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రానున్న‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు టీడీపీ, కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిచి గెలిపించాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ పిలుపునిచ్చారు. రేప‌ల్లె వంటి సముద్ర తీర ప్రాంత ప్రజలకు విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ లైన్లకు రక్షణ కవర్లు ఏర్పాటు చేయడంతో పాటు కొత్త విద్యుత్ లైన్లు కూడా వేస్తున్నామన్నారు. ప్రజలు సైతం సహకరిస్తే అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

ఒక్క రూపాయి భారం మోప‌లేదు...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రెండేళ్ల నాలుగు నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ బిల్లు పెంచలేదని మంత్రి గొట్టిపాటి వెల్ల‌డించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకు ఒకసారి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని ఆయ‌న విమర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటమే కూటమి ప్రభుత్వ విధానమని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైన సమయాల్లో బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేసి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నామని వివరించారు. సముద్ర తీర ప్రాంతమైన రేపల్లెలో ఆక్వా రైతుల విద్యుత్ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రేపల్లె ప్రాంత అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పన విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుటుంద‌న్నారు.

టీడీపీ, కూట‌మి గెలుపే ల‌క్ష్యంగా...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవైపు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే మరోవైపు రాష్ట్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిందో, ప్రజలకు ఎంత సంక్షేమం అందించిందో ప్రతి ఒక్కరూ గమనించాలని ఆయ‌న‌ కోరారు. అదే సమయంలో గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు ఎంత అరాచ‌కం చేశారో కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. గత వైసీపీ పాలనకు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలందరూ అండగా నిలవాలన్నారు. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు టీడీపీతో పాటు కూటమి అభ్యర్థులకు మద్దతిచ్చి వారంద‌రినీ గెలిపించాలని ఆయ‌న‌ కోరారు. స్థానిక సంస్థల్లోనూ కూటమికి ప్రజలు పట్టం కడితే అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు మ‌రింత‌గా అవకాశం ఉంటుందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో కూట‌మి నేత‌ల‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.