BREAKING
తూప్రాన్ లో విద్యుత్ కోతులను నిరసిస్తూ ఆందోళన క్షయ వ్యాధి రహిత భారత్‌ లక్ష్యంగా ‘జోష్’ టీముల ఏర్పాటు చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం తూప్రాన్ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో జోష్ టీమ్‌ ప్రారంభం ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి 7 కోట్లు నిధులు వెట్టిచాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛా రథం’ పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నీటి కోసం పాట్లు..!అర కిలోమీటర్ విద్యార్ధినుల నడక..! శనీశ్వర స్వామి వారి దర్శించుకున్న మెప్ప డైరెక్టర్ గ్రామీణ కళాకారులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి టీబీ నిర్మూలనకు... జోష్ టీమ్ శ్రీకారం

రీ-సర్వే తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణoకి కుర్మనాధ్

Select Suryaa Now
రీ-సర్వే తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం  రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణoకి కుర్మనాధ్

చుండూరు/ వేమూరు :  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన భూ రీ-సర్వే, గ్రౌండు ట్రూతింగు, ఈ- కేవైసీ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంటు మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ అధికారులను ఆదేశించారు. గురువారం చుండూరు మండలం వేటపాలెం, వేమూరు మండలం జంపాణి గ్రామాలలో క్షేత్ర స్థాయి లో జరుగుతున్న రీ-సర్వే పనులను డైరెక్టర్, జిల్లా సర్వే, రెవెన్యూ అధికారుల తో కలిసి స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా సర్వే సిబ్బంది చేస్తున్న గ్రౌండు ట్రూతింగు, ఈ-కేవైసీ ప్రక్రియలను దగ్గరుండి గమనించిన డైరెక్టర్, అక్కడ ఉన్న రైతులు, రెవిన్యూ, సర్వే సిబ్బందితో ముఖాముఖి మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న పలు సాంకేతిక, భూ సమస్య లపై సుదీర్ఘంగా సమీక్షించారు. “రీ-సర్వే”  ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని చెప్పడానికి నిదర్శనంగా చుండూరు మండలం వేటపాలెం, వేమూరు మండలం జంపాణి గ్రామాలలో రాష్ట్ర  డైరెక్టర్ కూర్మనాధ్ సమక్షంలోనే సిబ్బంది రైతుల భూ కమతాలను సర్వే చేసి డేటాను సేకరించారు. తమ కళ్ళ ముందే తమ సమక్షంలో అధికారులు సర్వే చేస్తుండటం పై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సర్వే, సెటిల్మెంటు మరియు ల్యాండ్ రికార్డ్స్  డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ మాట్లాడుతూ ప్రజలు, రైతుల సమక్షంలో పనులు చేపట్టి పూర్తి చేస్తేనే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. భూ రికార్డుల ప్రక్షాళన, రైతులకు ఖచ్చితమైన భూహక్కులు కల్పించడమే లక్ష్యంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న రెవిన్యూ, సర్వే సిబ్బంది సేవలు అభినందనీయం అని అధికారులను కొనియాడారు.

క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో జిల్లా సర్వే సహాయ సంచాలకులు శేష గిరి రావు, జిల్లా సర్వే ఇన్స్పెక్టర్  అల్టఫ్, చుండూరు, వేమూరు తహశీల్దార్లు డి.నాగరాజా రావు, పి. పార్వతి,  రెవిన్యూ, సర్వే సిబ్బంది, పెద్ద ఎత్తున రైతులు, తదితరులు పాల్గొన్నారు