రైతులకు రాయితీపై పలు విత్తనాలు
నిజాంపట్నం, మేజర్ న్యూస్: ఖరీఫ్ లో పంట వేయకుండా ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో మినుము వేసుకోవాలి అనుకునే రైతులకు రాయితీపై మినిమము విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి శ్రీమతి కామినేని లక్ష్మీ దుర్గ రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా మండలంలోని పల్లపట్ల, కూచినపూడి, ప్రజ్ఞం, గ్రామాలలో గురువారం ఏవో సబ్సిడీ రాయితీపై మినుము విత్తనాలు పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రైతులందరికీ పంటల భీమా వర్తించదు. ప్రీమియం (రైతు వాటా) ను మీ గ్రామంలోని లేదా మండలంలోనూ సి ఎస్ సి సెంటర్ నందు లేదా మీ సేవ కేంద్రాలలో చెల్లించాలని ఆమె సూచించారు. విత్తనాలు అవసరం ఉన్న రైతులకు అన్ని రైతు సేవ కేంద్రాలలో 30 క్వింటాళ్లు మినుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రీమియం చెల్లించేందుకు చివరి తేదీ మరియు ప్రీమియం వివరాలు (రబ్బీ వరి) రూ215, తేదీ 30-12-26, (మినుము) రూ 102 తేదీ 15-12-26,(మొక్కజొన్న) రూ105 తేదీ 15-12-26, (జొన్న, చిరుధాన్యాలు) రూ60 తేదీ 15-12-26 తేదీలలోపు చెల్లించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి డి. వెంకట గోపికృష్ణ, మండలంలోని వ్యవసాయ సహాయకులు మరియు పలు గ్రామ రైతులు పాల్గొన్నారు.