BREAKING
పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, అయినవిల్లి కార్యనిర్వహణాధికారి వారి సమక్షములో ధర్మకర్తల మండలి సమావేశం దివాన్ చెరువులో జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఘన నివాళి :పేద మహిళలకు చీరల పంపిణీ తాతల నాటి కళకు.. మనవళ్ల సాంకేతికత తోడైతే.. జీఎస్టీ సమూల ప్రక్షాళన: అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు.. జీఎస్టీ సంస్కరణలకు పారిశ్రామిక వర్గాల జేజేలు.. క్యాన్సర్ మందుల ట్రేడ్ మార్జిన్లపై 30% పరిమితి: కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటన.. రోగులకు భారీ ఊరట! నౌకా నిర్మాణ రంగం, మైన్ కౌంటర్ మెజర్స్ సహకారంపై భారత్-జపాన్ దృష్టి: వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ జపాన్ పర్యటన! నేటి రాశి ఫలాలు (10 అక్టోబర్ 2026 – శనివారం) నేటి పంచాంగం (10 అక్టోబర్ 2026 – శనివారం) పండుగ సేల్స్‌కు అదిరిపోయే ఆరంభం సామాన్య భక్తులకు 8 గంటలపాటు జగన్మాత దివ్య దర్శనం ప్రజా దర్బార్‌తో సమస్యల పరిష్కారానికి భరోసా * కంకిపాడు లాక్‌ రోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళల అభ్యంతరం * ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రతో మాట్లాడిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జేఎన్‌టీయూకే అంతర్ కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగింపు

రైతుబిడ్డ నుంచి భారత పారా త్రోబాల్ జట్టు కోచ్‌గా

Select Suryaa Now
రైతుబిడ్డ నుంచి భారత పారా త్రోబాల్ జట్టు కోచ్‌గా

భీమవరం సూర్య న్యూస్: సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, క్రీడారంగంలో అంచెలంచెలుగా ఎదిగిన కలిదిండి శివరామకృష్ణరాజు భారత పురుషుల పారా త్రోబాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికై స్ఫూర్తిగా నిలిచారు. పాలకొల్లు మండలం దగ్గులూరుకు చెందిన ఆయన వాలీబాల్ క్రీడాకారుడిగా ప్రస్థానం ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు.క్రీడా కోటాలో ముంబై జోన్ ఆదాయపు పన్ను శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం పొందిన ఆయన, అనంతరం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో క్రీడలు, శారీరక శిక్షణ విభాగంలో సేవలందించారు. 500 మందికి పైగా ఐపీఎస్ అధికారులకు శిక్షణ అందించిన అనుభవం ఆయనకు ఉంది.పారా క్రీడలపై ఆసక్తితో పనిచేస్తున్న ఆయన ప్రతిభ, అనుభవాన్ని గుర్తించిన ప్రభుత్వం జాతీయ పారా త్రోబాల్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. నవంబర్ 19 నుంచి 23 వరకు శ్రీలంకలో జరిగే రెండో దక్షిణాసియా పారా త్రోబాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరించనున్నారు.శ్రమిస్తే విజయం తథ్యంయువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిరంతరం శ్రమించాలని శివరామకృష్ణరాజు సూచించారు. క్రీడల్లో రాణిస్తే ఉన్నత ఉద్యోగాలతో పాటు దేశానికి సేవ చేసే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తనపై ప్రభుత్వం ఉంచిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించి భారతదేశానికి మంచి పేరు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా