BREAKING
*దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు* సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య... వేమవరంలో 40 ఏళ్ల టీడీపీ ఆధిపత్యానికి తెర.. స్వతంత్ర అభ్యర్థి నంబూరి రాజ్యలక్ష్మి ఘన విజయం జలుమూరు మండల పేజ్ 3 పిఓలకు శిక్షణ. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతినే మార్చింది మాజీమంత్రి హరీశ్‌రావు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వ్యాఖ్య సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు హరీశ్‌రావు వ పంచాయతీల పరిపుష్టికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత : బసినికొండ టిడిపి సర్పంచ్ అభ్యర్థిని సి.అనిత వెల్లడి : మంచం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని వినతి గుమ్మపాడు టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సింహాద్రమ్మకు మద్దతుగా విస్తృత ప్రచారం.. తట్టివారిపల్లి సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తా : వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిని రేపన గంగాదేవి వెల్లడి :కత్తెర గుర్తుపై ఓటువేసి ఆశీర్వదించాలని మనవి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభకి సలాం : సహస్ర ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రామిరెడ్డి అభినందనలు : కోచ్ మురళి శిక్షణకి ప్రత్యేక ప్రశంసలు ప్రధాని మోదీ 'మన్ కి బాత్' ప్రతి బూత్ స్థాయిలో విస్తృతంగా జరగాలి ఫూలే విగ్రహం ఏర్పాటు చేయడంలో ఎందుకీ నిర్లక్ష్యం.. నగర ప్రజాప్రతినిధులారా.. కళ్లుతెరవండి నాటకాలు వద్దు డాక్టర్ పోతుల నాగరాజు.. ఎల్ కోట జామి వీధి లో భారీ శబ్దం తో పేలిన కుక్కర్ వంటగది చిందరవందర.. తృటిలో తప్పిన ప్రమాదం వేధింపులతో మహిళ ఆత్మహత్య ఓటెత్తారు...... రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.... 85.78 శాతం భారీ పోలింగ్ నమోదు

రావుపల్లి గ్రామస్తులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా! నూతన సర్పంచ్ బోను విజయలక్ష్మి

Select Suryaa Now
రావుపల్లి గ్రామస్తులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా!  నూతన సర్పంచ్ బోను విజయలక్ష్మి

గరుగుబిల్లి, నవంబర్ 28, మేజర్ న్యూస్: గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో తనపై నమ్మకం ఉంచి, భారీ మెజారిటీ తో గెలిపించిన ప్రతి ఒక్క ఓటరుకు, గ్రామ పెద్దలకు,యువతకు మరియు మహిళలకు సర్పంచ్ బోను విజయ లక్ష్మి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రావుపల్లి గ్రామ పంచాయతీ కి నూతన సర్పంచ్ గా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బోను విజయలక్ష్మి"సూర్య ప్రతినిధి"తో మాట్లాడారు.ఈవిజయం తనది కాదని, రావుపల్లి గ్రామ ప్రజలందరి విజయ మని పేర్కొన్నారు.ఎన్నికల సమయం లో తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు, మద్దతుదారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియ జేశారు.గ్రామస్తులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, రావుపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని విజయలక్ష్మి స్పష్టం చేశారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుధ్యం మరియు సంక్షేమ పథకాల ను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రాజకీ యాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించ డమే తమ లక్ష్యమని ఈసందర్భంగా సర్పంచ్ బోను విజయలక్ష్మి వెల్లడిం చారు.రావుపల్లిని మండలంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దు తానని ఆమె తెలిపారు.తనపై ఎంతో నమ్మకంతో అపూర్వ విజయాన్ని అందించిన రావుపల్లి గ్రామ పంచా యతీ ఓటర్లకు, గ్రామ పెద్దలు, అహర్ని శలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు,యువకులకు,మహిళలకు మరియు శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీలకు అతీతంగా గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తానని సర్పంచ్ బోను విజయలక్ష్మి హామీ ఇచ్చారు.