రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు జీబీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థుల ఎంపిక.
హ్యాండ్‌బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు.
అనపర్తి, మేజర్ న్యూస్. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అనపర్తిలోని జీబీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికై కళాశాలకు మంచి గుర్తింపు తీసుకువచ్చారు. వివిధ క్రీడా విభాగాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి పలువురు విద్యార్థులు తూర్పుగోదావరి జిల్లా జట్లకు ఎంపికయ్యారు. ఈ నెల 9వ తేదీన కాకినాడలోని డీఎస్ఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అండర్-19 అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో షాట్‌పుట్ విభాగంలో ముమ్మిడివరపు దీవెన శ్రీ ప్రనీత కళ్యాణి ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. అదేవిధంగా హ్యాండ్‌బాల్ జట్టుకు కొండపల్లి తనుష్ ఎంపికయ్యారు.అలాగే ఈ నెల 10వ తేదీన అనపర్తి బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అండర్-17 బాలుర వాలీబాల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో కత్తుల ఆదర్శ్ కుమార్ ప్రధాన జట్టుకు ఎంపికయ్యారు. బాలికల వాలీబాల్ జట్టుకు నక్క రీశశ్రీ కీర్తన స్టాండ్‌బై క్రీడాకారిణిగా ఎంపికయ్యారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ పి.ఆర్.ఎల్. స్వామి, ఫిజికల్ డైరెక్టర్లు ఎం.వి.వి. రామారెడ్డి, డేవిడ్ రాజు, విజయ్ బర్న్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ తేతలి ఆదిరెడ్డి కొండబాబు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.పి. అబ్బాయిరెడ్డి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఎంపికైన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.