రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తాం - చిత్తూరు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 77వ రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశ స్వేచ్ఛ, సమగ్రతను రక్షించడానికి కృషి చేస్తామని జిల్లా అధ్యక్షుడు వి. శివయ్య ఆధ్వర్యంలో ప్రమాణం చేశారు. రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను గౌరవిస్తామని, ప్రాథమిక హక్కులను కాపాడుకుంటామని, ప్రాథమిక విధులను నిర్వర్తిస్తామని, నీతి, నిజాయితీతో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడతామని, ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించేలా చట్టం చేయాలని చేసిన అభ్యర్థనకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డి. నరేష్ బాబు, కోశాధికారి ఎల్‌వి చలపతి, సహ అధ్యక్షుడు ఎం. దేవకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వివేక్, ప్రమీల, దుర్గాప్రసాద్, వరలక్ష్మీదేవి, ఉమా, కృష్ణమూర్తి, జిల్లా జాయింట్ సెక్రటరీలు వేణుగోపాల్, కిషోర్, ధరణి కుమార్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఎస్. రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు రిపోర్టర్ అజయ్ కుమార్