రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు రేపల్లె బార్ అసోసియేషన్ ఘన నివాళి
రేపల్లె మేజర్ న్యూస్:, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రేపల్లె బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాలూకా సెంటర్‌లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సభలో న్యాయవాదులు మాట్లాడుతూ అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ ప్రధాన శిల్పిగా అభివర్ణించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వం కల్పించిందని తెలిపారు. కుల, మత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమానంగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ, చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, మాజీ అధ్యక్షులు దారం సాంబశివరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేకా పూర్ణచంద్రరావు, ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి జాన్ హనోక్, రిటైర్డ్ జడ్జి పి. ప్రసాదరావు, న్యాయవాది జై భీమ్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దోవా రమేష్ రాంజీ, ట్రెజరర్ గుంటూరు విజయకుమారి, కార్యవర్గ సభ్యులు కట్టుపల్లి కాకమ్మ, దాసరి శ్రీవల్లి, మాజీ అధ్యక్షులు పుప్పాల ఐజ్, కేసన వెంకట గోపాలరావు, గుజ్జర్లమూడి ప్రశాంత్ కుమార్, ఒడుగు రాంబాబు, ఏపీపీ అనగాని శ్రీనివాసమూర్తి, మెండు సుబ్బారావు, ఆయుబ్ ఖాన్, కొమ్మూరి శ్రీధర్ బాబు, తెనాలి దీనరాజు, దివి హరి, చందోలు కోటేశ్వరరావు, గురింతపల్లి రామారావు, ఉప్పాల శ్రీనివాసరావుతో పాటు పలువురు సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.