రాజాం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యం --- టంకాల ప్రియాంక
రాజాం, సూర్య : రాజాం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగుదేశం నాయకురాలు టంకాల ప్రియాంక తెలిపారు. మంగళవారం ఆమె పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.రాజాం పురపాలక సంఘం పరిధి సారధి గ్రామానికి చెందిన మా కుటుంబం 1982 నుండి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నామని టంకాల ప్రియాంక తెలిపారు.తన మామయ్య గారైన టంకాల వెంకటేశo గారు టీడీపీకి వీరాభిమాని అని,ఏ రోజూ పార్టీ మారకుండా పార్టీని నమ్ముకుని సేవ చేస్తూ వచ్చారని అన్నారు.అప్పట్లో రాజాం టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారని, ఎప్పుడూ పదవులను ఆశించలేదని గుర్తుచేశారు. తన భర్త దిలీప్ కుమార్ కూడా కష్టకాలంలో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలిచారని తెలిపారు.ఎంతో మంది పార్టీలు మారినా,కొత్తగా వచ్చిన వారిని చూసినా తాము మాత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు,మంత్రి నారా లోకేష్ లక్ష్యానికి కట్టుబడి ఉన్నామన్నారు.ఇన్నేళ్ల తర్వాత రాజాం మున్సిపాలిటీ అయిందని,తమ వర్గీయులు,అభిమానులు తనను మున్సిపల్ చైర్మన్ గా చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్,ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదేశాలను,సూచనలను గౌరవిస్తామని,పార్టీ పెద్దలను కాదని ఎటువంటి నిర్ణయం తీసుకోమన్నారు.పార్టీ ఆదేశించి, స్థానిక ఎమ్మెల్యే అనుమతిస్తే చైర్మన్ గా పోటీ చేసి టీడీపీని మున్సిపాలిటీలో గెలిపించడమే తమ లక్ష్యమని టంకాల ప్రియాంక స్పష్టం చేశారు.
రిపోర్టర్ : కె జె చక్రధరి, రాజాం, విజయనగరం జిల్లా.