రాజధాని అమరావతి లాగా రేపల్లె కూడా అభివృద్ధి చెందుతుంది
రేపల్లె మేజర్ న్యూస్;
రాజధాని అమరావతి లాగా రేపల్లె నియోజకవర్గం కూడా అభివృద్ధి పథంలో నడుపుతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు బుధవారం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డుల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ విజనరీ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా వేల కోట్ల రూపాయలు హెచ్చించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అద్వాన పరిస్థితికి మార్చిందని గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర 35 ఏళ్లు వెనక్కి పోయిందని ఆరోపించారు. 2019- 24 సంవత్సరంలో రాష్ట్రంలో అలజడులు దౌర్జన్యాలు దాడులతో రెచ్చిపోయారని అందుకని ఇసుకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొడ్డలి పార్టీని పాతాళానికి తొక్కారని విమర్శించారు. గొడ్డలి పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కోటమి అభ్యర్థులు ఘనివిజయం సాధిస్తున్నారని తెలిపారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తున్నామని అందులో భాగంగానే సూపర్ సిక్స్ ను సూపర్ 23 నీ చేసామన్నారు. పట్టణంలో ప్రతి వార్డులో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశామనీ మారుమూలం ఉన్న గృహాలకు కూడా సిసి రోడ్లు వేసేమని తెలిపారు అభివృద్ధి సంక్షేమంతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నామని తెలిపారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు సుందరంగా పార్కులను ఆధునికరించామని ప్రతి ఒక్కరూ తమ పిల్లలతో పార్కులోకి వచ్చి ఆనందం వెదజల్లుతున్నారని తెలిపారు. తీర ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయినా ప్రభుత్వ వైద్యశాలను వంద పడకల వైద్యశాలగా మంజూరు చేయించి నిధులను కేటాయించి 66 నూతన ఉద్యోగాలు కూడా మంజూరు చేయించామని ఇవే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనేకులకు కోట్ల రూపాయలతో సీఎం సహాయనిధి చెక్కులను అందించామని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు అధిక సంఖ్యలో వస్తున్నాయని రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు రాష్ట్రంలోని ప్రజలు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న పరిపాలనకు రాష్ట్ర ప్రజలు శభాష్ అని మెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో చైర్ పర్సన్ అభ్యర్థి కుర్ర అవర్ణ, కృష్ణ పశ్మ డెల్టా నీటి సంఘాల చైర్మన్ పంతాని మురళీధరరావు కౌన్సిలర్ అభ్యర్థులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు