రాచమల్లు సంయమనంతో మాట్లాడాలి: కొండారెడ్డి
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్ : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంయమనంతో మాట్లాడాలని టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి హితవు పలికారు. స్థానిక డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నామినేషన్ల ప్రక్రియపై రాచమల్లు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. 2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను గుర్తుచేసుకోవాలన్నారు. ప్రొద్దుటూరులో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం, కార్యకర్తలను రెచ్చగొట్టడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంటే, రాజకీయ కక్షపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తూ, సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలని కొండారెడ్డి సూచించారు.
- ఎ ప్రతాప్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా