BREAKING
కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పరిశ్రమల సమన్వయం: సీఐఐ హిమాచల్ ప్రదేశ్ సదస్సు 3కె హెల్త్ వాక్‌ను విజయవంతం చేయండి.. VC

ప్రతి పల్లెకు పక్కా రహదారులే లక్ష్యం

Select Suryaa Now
ప్రతి పల్లెకు పక్కా రహదారులే లక్ష్యం


రూ.2.31 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజల చిరకాల స్వప్నాలను సాకారం చేస్తాం : ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ లక్ష్మునాయుడు
బాడంగి, సెప్టెంబర్ 30 (మేజర్ న్యూస్): ప్రతి పల్లెకు పక్కా రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తోందని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు అన్నారు. బాడంగి మండలం మల్లంపేట గ్రామంలో బుధవారం  ఎస్ ఏ ఎస్ సి ఐ నిధులతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు.
సి ఆర్ ఆర్
(చిలకపాలెం–రామభద్రపురం–రాయగడ) హైవే నుంచి మల్లంపేట గ్రామం మీదుగా పాల్తేరు వరకు రూ.2.31 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ రహదారి పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా ప్రయోజనం కలగనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులు అత్యంత కీలకమని, ప్రతి పల్లెకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామని పేర్కొన్నారు.
బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రహదారులే ప్రధాన ఆధారమని, ప్రజల చిరకాలంగా ఎదురుచూస్తున్న రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పల్లె పండుగ 3.0లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి నాణ్యతతో పనులు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి గిరడ అప్పలస్వామి, విజయనగరం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వేమకోటి గిరిబాబు, బాడంగి మండల టీడీపీ అధ్యక్షుడు తెంటు రవి బాబు, మాజీ ఎంపీపీలు యజ్జల లక్ష్మి, బొంతు త్రినాథ నాయుడు , పీఏసీఎస్‌ చైర్మన్ లచ్చుపతుల సత్యం, ఎల్.ఈశ్వరరావు కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.