BREAKING
ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా? అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. విజయవాడలో ఘనంగా ‘అమ్మ కనకదుర్గ’ ఆవిష్కరణ! పంచేడు వైసీపీ శ్రేణులు టీడీపీ బాట.. 50 మందికిపైగా నేతల చేరిక – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైభవంగా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్ నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు గుంతమార్పల్లిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు మల్లేశ్వరం దసరా ఉత్సవాలలో ప్లాస్టిక్‌కు స్వస్తి.. స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో అన్నసమారాధన!

ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Select Suryaa Now
ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

‎  
రేపల్లెలో 181 నామినేషన్ దాఖలు 
‎‎మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు
‎రేపల్లె మేజర్ న్యూస్;
‎‎స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా రేపల్లె మున్సిపాలిటీలో మొత్తం 181 నామినేషన్లు దాఖలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాకర్ల సాంబశివరావు తెలిపారు. 
చైర్ పర్సన్ స్థానానికి  మొత్తం 10 నామినేషన్ దాఖలు కాగా వీటిలో తెలుగుదేశం పార్టీ 4 నామినేషన్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు నామినేషన్లు, బీఎస్పీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి, చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 36 వార్డులకు గాను తెలుగుదేశం తరపున 77 మంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 79 మంది, జనసేన పార్టీ తరఫున 17, బిజెపి తరఫున రెండు సిపిఎం తరపున మూడు బీఎస్పీ తరఫున ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు ఒకటి మొత్తం 181 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేసినట్లు కమిషనర్ తెలిపారు. నామినేషన్ ప్రక్రియ ముగియడంతో ఈ నెల 19వ తేదీ సోమవారం నామినేషన్ పరిశీలన జరుగుతుందని నామినేషన్ పరిశీలన నామినేషన్ వేసిన కేంద్రాలలోనే పరిశీలన జరుగుతుందని ఆయన తెలిపారు. 21వ తేదీ నామినేషన్ ఉపసంహరణ మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుందని అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరుగుతుందని సాంబశివరావు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన రాజకీయ పార్టీల నాయకులకు అధికారులకు పోలీసు అధికారులకు కమిషనర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 28వ తేదీ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారని 30వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని అదే రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని కమిషనర్ సాంబశివరావు తెలిపారు.