BREAKING
పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, అయినవిల్లి కార్యనిర్వహణాధికారి వారి సమక్షములో ధర్మకర్తల మండలి సమావేశం దివాన్ చెరువులో జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఘన నివాళి :పేద మహిళలకు చీరల పంపిణీ తాతల నాటి కళకు.. మనవళ్ల సాంకేతికత తోడైతే.. జీఎస్టీ సమూల ప్రక్షాళన: అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు.. జీఎస్టీ సంస్కరణలకు పారిశ్రామిక వర్గాల జేజేలు.. క్యాన్సర్ మందుల ట్రేడ్ మార్జిన్లపై 30% పరిమితి: కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటన.. రోగులకు భారీ ఊరట! నౌకా నిర్మాణ రంగం, మైన్ కౌంటర్ మెజర్స్ సహకారంపై భారత్-జపాన్ దృష్టి: వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ జపాన్ పర్యటన! నేటి రాశి ఫలాలు (10 అక్టోబర్ 2026 – శనివారం) నేటి పంచాంగం (10 అక్టోబర్ 2026 – శనివారం) పండుగ సేల్స్‌కు అదిరిపోయే ఆరంభం సామాన్య భక్తులకు 8 గంటలపాటు జగన్మాత దివ్య దర్శనం ప్రజా దర్బార్‌తో సమస్యల పరిష్కారానికి భరోసా * కంకిపాడు లాక్‌ రోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళల అభ్యంతరం * ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రతో మాట్లాడిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జేఎన్‌టీయూకే అంతర్ కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగింపు

ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా భీమవరంలో మ్యాక్సివిజన్ అవగాహన ర్యాలీ

Select Suryaa Now
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా భీమవరంలో మ్యాక్సివిజన్ అవగాహన ర్యాలీ

భీమవరం, సూర్య న్యూస్: ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం మ్యాక్సివిజన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుమారు 50 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.మ్యాక్సివిజన్ కంటి ఆసుపత్రి వద్ద ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం అక్కడి నుంచి తిరిగి ఆసుపత్రికి చేరుకోవడంతో ర్యాలీ ముగిసింది. ర్యాలీలో పాఠశాల విద్యార్థులు, డీఓఏ కళాశాల విద్యార్థులు, కళాశాల సిబ్బంది, వైద్యులు, మ్యాక్సివిజన్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.కార్యక్రమంలో ఆసుపత్రి ఏపీ నిర్వహణ విభాగం అధిపతి ప్రదీప్, ఆసుపత్రి మేనేజర్ నాగరాజు, మార్కెటింగ్ విభాగం అధిపతులు భీమా, కోటి, క్లస్టర్ హెడ్ శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆసుపత్రికి చెందిన సిబ్బంది మొత్తం కార్యక్రమంలో పాల్గొని తమ సహకారం అందించారు.ఈ సందర్భంగా మ్యాక్సివిజన్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రస్తుతం వివిధ రకాల కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. కంటికి సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు అవసరమైన చికిత్స తీసుకోవడం ద్వారా దృష్టిని కాపాడుకోవచ్చని డాక్టర్ సుధాకర్ తెలిపారు. ప్రజలు తమ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీ ద్వారా కంటి ఆరోగ్యం, కంటి సమస్యలపై ముందస్తు పరీక్షలు, దృష్టి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా