ప్రముఖ వైద్యుని నిర్మాణంలో ఉన్న నూతన గృహంలో విద్యుత్ పరికరాలు చోరీ
ప్రముఖ వైద్యుని నిర్మాణంలో ఉన్న నూతన గృహంలో విద్యుత్ పరికరాలు చోరీ పెడన,మేజర్ న్యూస్: పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర వైద్యశాల వైద్యులు డాక్టర్ బి వెంకటేష్ ఇటీవల ఒక నూతన గృహాన్ని స్థానిక కాపుల వీధి ప్రాంతంలో నిర్మాణంలో ఉండగా మంగళవారం రాత్రి విద్యుత్ సంబంధించిన వైర్లు పరికరాలను సుమారు నాలుగు లక్షల రూపాయల విలువ చేసే వస్తువులను కనిపించకపోవడంతో ఒకసారిగా అవాక్కయి దొంగతనం జరిగింది అని గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని నెలలుగా పట్టణంలో గల 8వ వార్డు కాపుల వీధిలో తాను ఒక నూతన గృహాన్ని నిర్మించుకుంటున్నానని ఆ గృహానికి సంబంధించిన విద్యుత్ పరికరాలను ఇటీవల సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఖరీదు చేసి ఉంచానని చెబుతూ, ఎప్పటి లాగానే విద్యుత్ మెకానికులు బుధవారం ఉదయం వచ్చి చూడగా అక్కడ అన్ని వైర్లు కోసేసి ఉండటం గమనించి వెంటనే తనకు సమాచారం అందించారని హుటాహుటిగా సంఘటన స్థలానికి వెళ్లి చూడగా దొంగిలించటం జరిగిందని నిర్ధారణకు వచ్చి పోలీసులకు సమాచారం అందించామన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై గంట సత్యనారాయణ సమగ్ర దర్యాప్తు చేస్తానని హామీ ఇచ్చారు అని అన్నారు .