BREAKING
పల్లెపండుగ 3.0 లో సిసి రోడ్లకు శంకుస్థాపన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమం ఉచిత వైద్య శిబిరాలు రోగులకు ఎంతో మేలు తూప్రాన్ లో విద్యుత్ కోతులను నిరసిస్తూ ఆందోళన క్షయ వ్యాధి రహిత భారత్‌ లక్ష్యంగా ‘జోష్’ టీముల ఏర్పాటు చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం తూప్రాన్ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో జోష్ టీమ్‌ ప్రారంభం ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి 7 కోట్లు నిధులు వెట్టిచాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛా రథం’ పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నీటి కోసం పాట్లు..!అర కిలోమీటర్ విద్యార్ధినుల నడక..! శనీశ్వర స్వామి వారి దర్శించుకున్న మెప్ప డైరెక్టర్

ప్రమాదంలో గాయపడిన కార్యకర్తకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం మెరుగైన వైద్యం కోసం వైద్యులతో మాట్లాడిన అమిలినేని సురేంద్రబాబు

Select Suryaa Now
ప్రమాదంలో గాయపడిన కార్యకర్తకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం  మెరుగైన వైద్యం కోసం వైద్యులతో మాట్లాడిన అమిలినేని సురేంద్రబాబు

అనంతపురం బ్యూరో : ఆటో బోల్తాపడి వెన్నెముకకు తీవ్ర గాయాలైన కార్యకర్తకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆర్థిక సాయం అందించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని రాచప్పబావి వీధికి చెందిన నాగరాజు ఇటీవల ఆటో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషయాన్ని స్థానిక నాయకులు, నాగరాజు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులతో మాట్లాడి అవసరమైన వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం నాగరాజు వైద్య ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ప్రమాదంలో గాయపడిన నాగరాజుకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.