BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

ప్రజల హృదయాలను గెలిచిన "బిఎన్"...!!

Select Suryaa Now
ప్రజల హృదయాలను గెలిచిన "బిఎన్"...!!

ప్రజల హృదయాలను గెలిచిన "బిఎన్"...!!
- ఎన్నడూలేని విధంగా ఎన్ఎన్ పాడులో "సిఎంఆర్ఎఫ్" మహోత్సవం
- రెండేళ్ళ కాలంలో నియోజకవర్గంలో 2,450 మందికి
  రూ. 18.83 కోట్లు సిఎం సహాయనిధి 
- అర్హులందరికి సిఎంఆర్ఎఫ్ మంజూరుకై నిరంతర పర్యవేక్షణ                                   - నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తా
- ఒంగోలులో సిఎంఆర్ఎఫ్ మహోత్సవంలో ఎమ్మెల్యే బి.ఎన్ విజయ్ కుమార్

సూర్య, ఒంగోలు :

పేద ప్రజల ఆరోగ్యానికి బిఎన్ భరోసాగా నిలిచారు. ఎన్నడూలేని విధంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ మంజూరు ఉత్సవంగా సాగుతోంది. మంగళవారం ఒంగోలు నగరంలోని బృందావనం పంక్షన్ హాల్లో సిఎంఆర్ఎఫ్ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో సంతనూతలపాడు నియోజకవర్గంలో 2,450 మంది లబ్ధిదారులకు రూ.18 కోట్ల 83 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సిఎంఆర్ఎఫ్ మహోత్సవంలో 504 మంది లబ్ధిదారులకు రూ.3 కోట్ల 6 లక్షల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బి.ఎన్ విజయ్ కుమార్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గాన్ని సంక్షేమం, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనారోగ్యంతో వైద్య చికిత్సలు చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్దే ధ్యేయంగా సంతనూతలపాడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తామని ఎమ్మెల్యే బి.ఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు మహిళలు భారీగా పాల్గొన్నారు.