ప్రజాస్వామ్యం పై కూటమికి నమ్మకం లేదు
విజయనగరం బ్యూరో, సూర్య : ప్రజాస్వామ్యం మీద రెండున్నర పాలనపై కూటమికి నమ్మకం లేద నీ శాసన మండలి ప్రతి పక్ష నేత బొత్స సత్యనారాయణ ద్వజమెత్తారు. బుధవారం వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట పై నమ్మకం లేదు అని కూటమి నాయకులు ఏమి చెబుతారనీ చొక్కా పట్టుకుని అడుగుతున్న నాయకులు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. రాబోయేది జగన్ ప్రభుత్వం దిన్ని ఎవ్వరూ ఆపలేరు జరుగుతున్న దారుణాలపై విచారణ చేపట్టి తప్పు చేసే అధికారులు పై చర్యలు తప్పవు అని హెచ్చరించారు. డీఐ జి స్థాయి అధికారులు ప్రెస్ మీట్స్ పెట్టీ మాట్లాడుతున్నార నీ ఈస్ట్ గోదావరిలో నామినేషన్ వేస్తున్న వైసీపీ వారిని పోలీసులు అడ్డుకుని వెళ్ళిపొండి చెప్పడం దారుణమన్నారు. పోలీసులు తో నేనే స్వయంగా మాట్లాడానన్నారు.అత్యున్నత న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చినా తీరు మారక పోతే ఎలా ఇది ప్రజాస్వామ్యమా అన్నారు. గతంలో ఎన్నికలపుడు చేతులు ఎత్తి బహిష్కరించావు మేము పోటీకి సై అని పోరాడుతున్నామని పోలీసుల తో దుశ్చర్యలకు పాల్పడుతుర న్నారు. న్యాయ స్థానం ఆర్డర్ మేరకు ఎన్నికల ప్రక్రియ జరగాలన్నారు. వెన్నుపోటు పార్టీ , వత్తాసు పలుకుతున్న తీరు పై మేధావులంతా ఆలోచించండనీ ఏ విధంగా చట్టాన్ని అమలు చేస్తున్నారో ప్రజాస్వామ్యం అపహాసం చేస్తున్నారన్నారు. పోలీసుల యంత్రాంగం ఆలోచించాలనీ రెండున్నర అరువాత న్యాయ విచారణ తప్పదన్నారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ దుస్త్ ప్రభుత్వం కు బుద్ధి చెప్పాల నీ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ఈ సి ఏమి చేస్తుందన్నారు. ఈ పోలీసులు పై నమ్మకం లేకే కేంద్ర బలగాలు కోరాం ఏపీ లో ఇలాంటి వి ఎప్పుడైనా చూశామా అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు, జిల్లా పార్టీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.