*ప్రధాన కూడళ్లలో పోలీసులు నిరంతరం గస్తీ..*
*అన్నమయ్య జిల్లా - మదనపల్లె*
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* ఆదేశాలతో పోలీసు బలగాలు ముమ్మరంగా 'విజిబుల్ పోలీసింగ్', వాహన తనిఖీలు చేపట్టాయి.ప్రధాన కూడళ్లలో పోలీసులు నిరంతరం గస్తీ కాస్తూ అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచడంతో పాటు, సరైన పత్రాలు లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకై చేపట్టిన ఈ తనిఖీలకు ప్రజలు సహకరించాలని, ప్రయాణ సమయాల్లో వాహనదారులు తప్పనిసరిగా తమ ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
పాలగిరి గౌరి శంకర్..సూర్య తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంచార్జ్