ప్రచారంలో దూసుకెళ్తున్న డాక్టర్ షకీలా - ఆనం కైవల్యా రెడ్డి తో ఇంటింటా ప్రచారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్: కూటమి ఆధ్వర్యంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ షకీలా శనివారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్య రెడ్డితో కలిసి ఆమె పలు వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల విశేషాధరణ లభిస్తుండడం తో ఆమె ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఆయా వార్డుల్లో మహిళలు మంగళ హారతులతో, జనాలు పూలమాలలు శాలువాలతో సన్మానిస్తూ అఖండ స్వాగతం పలుకుతూ చిరకాలంగా సేవలందిస్తున్న బొమ్మిరెడ్డి కుటుంబం, అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన ఆనం రామనారాయణ రెడ్డి సేవలను తాము గుర్తిస్తున్నామని, చైర్ పర్సన్ గా బొమ్మిరెడ్డి షకీలా కు సంపూర్ణ మద్దతు ఇస్తామని, ఆమె విజయం సంకల్పంగా భావిస్తామని సర్వత్రా పేర్కొంటున్నారు.దాదాపు 40 సంవత్సరాలుగా బొమ్మిరెడ్డి కుటుంబఅగ్రజుడు డాక్టర్ బొమ్మిరెడ్డి సుందర్ రామిరెడ్డి మూడు డపాలు శాసనసభ్యులుగా ప్రజలకు సేవలు అందించడంతోపాటు, తుదిశ్వాస విడిచే వరకు పేదల వైద్యుడిగా పేరుగాంచి వైద్య సేవలు అందించారు. ఆయన కుమారుడు, షకీలా భర్త అయిన బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆత్మకూరు మండలాధ్యక్షుడుగా, ఆత్మకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ గా, జిల్లా టెలికం సభ్యులుగా, ఆత్మకూరు ఆర్టిసి నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడుగా అన్ని వర్గాల ప్రజలకు, కార్మికులకు విశేష సేవలు అందించారు. డాక్టర్ షకీలా బి ఎస్ ఆర్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలందించడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ఆమె నిర్వహించారు. ఆమె తనయుడు, యువ నేత బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి బిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గా అనేక సామాజిక సేవలను అందించారు. దాంతోపాటు ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా నాడు,నేడు ఆత్మకూరు అభివృద్ధికి అనూహ్యంగా కృషి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆనం అభివృద్ధి, బొమ్మిరెడ్డి కుటుంబం అందించిన సేవలు వెరసి డాక్టర్ షకీలా కు అనూహ్య ప్రజాదరణ లభిస్తుంది. విజయ పదం వైపు దూసుకెళుతుందని సర్వత్ర అభిప్రాయపడుతున్నారు. ప్రచార కార్యక్రమంలో డాక్టర్ షకీలా తో పాటు ఆనం కైవల్యా రెడ్డి తెలుగు మహిళా నాయకురాలు పులిమి శైలజా రెడ్డి, ఆయా వార్డుల తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థులు, ఆయా ప్రాంతాల తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.