ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించాలి
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించాలి
- మండల వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి
దువ్వూరు, మేజర్ న్యూస్ :మండలంలోని రసాయనిక, క్రిమిసంహారిక మందుల డీలర్లు,ఎరువుల దుకాణ డీలర్లు తమ వద్ద ఉన్న ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని మండల వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి అన్నారు. గురువారం దువ్వూరు మండలంలోని వివిధ రసాయనిక ఎరువుల దుకాణాలను, ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించి, పురుగుమందులను శాంపిల్స్ ను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది డీలర్లు యూరియాను ఇతర ప్రాంతాల నుండి తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యూరియా, డిఏపి ఎరువులను కేవలం ప్రభుత్వం నిర్ణయించిన యాప్ ద్వారానే విక్రయించవలసి ఉంటుందన్నారు. యాప్ లో నమోదు కానీ యూరియా, డిఏపి ఎక్కడైనా ఉంటే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. దుకాణాల్లోని పలు ఎరువులు, మందుల దుకాణాల లో శాంపిల్స్ తీసి వాటిని విజయవాడకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. దువ్వూరులో దుకాణాలకు యూరియా స్టాకు ఉన్నదని తెలిపారు