BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Select Suryaa Now
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పార్వతీపురం, అక్టోబర్ 6, మేజర్ న్యూస్ : పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వ బోధన కళాశాలలు, వైద్యశాలలు, జిల్లా, ప్రాంతీయ, సామాజిక వైద్యశాలల్లో సానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మన్యం జిల్లా గౌరవధ్యక్షులు ఆర్.వి.ఎస్. కుమార్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్టు ఏజెన్సీలు కార్మికులకు వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ, కొన్ని ఏజెన్సీలు నిబంధనలను సక్రమంగా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. జీఓ నెం.138 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.18,600 వేతనం చెల్లించాల్సి ఉండగా, సానిటేషన్ సిబ్బందికి రూ.12 వేలు , శానిటేషన్ సూపర్వైజర్స్కు 14 వేలు సెక్యూరిటీ సిబ్బందికి రూ.11,124, పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి సుమారు రూ.13 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ విషయం పై మంగళవారం ఉదయం  జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నాగజ్యోతి మెమోరాండం ఇచ్చి సమస్య లను వివరించారు.
అదేవిధంగా వేతనాలను సకాలంలో చెల్లించకపోవడం, పీఎఫ్, ఈఎస్‌ఐ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
20–25 సంవత్సరాలుగా పనిచేస్తున్న మహిళా కార్మికులను తొలగించే ప్రయత్నాలను నిలిపివేయాలని ఆయన కోరారు. వయోపరిమితి, విద్యార్హత వంటి నిబంధనలను సాకుగా చూపి దీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం సరికాదన్నారు.
కార్మికుల సమస్యలపై జిల్లా అధికార యంత్రాంగం, సంబంధిత వైద్యాధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని  కుమార్ కోరారు. ఈ కార్యక్రమం లో సెక్యూరిటీ సూపర్వైజర్ సంచార శంకర్రావు, శానిటేషన్ సూపర్వైజర్స్ చంద్రమౌళి, సుధీర్ కుమార్, అనురాధ, సావిత్రి, సత్యవతి లతో పాటు  కార్మికులు పాల్గొన్నారు.