BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ప్రాథమిక వైద్యంపై ఆర్ ఎమ్ పి లకు శిక్షణ..!!

Select Suryaa Now
ప్రాథమిక వైద్యంపై ఆర్ ఎమ్ పి లకు శిక్షణ..!!

ఆనందపురం, సూర్య : గాయత్రి విద్యా పరిషత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ (మారికవలస) ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సభ్యులకు ప్రథమ చికిత్స, ప్రాథమిక వైద్య సహాయంపై మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులు ప్రాథమిక వైద్యంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సకాలంలో ప్రథమ చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కోవడంలో కీలకంగా వ్యవహరించవచ్చన్నారు. ఆసుపత్రి ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ అచ్యుతరామయ్య మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులు తమ వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని కోరారు.
డాక్టర్ పి. అంజు, డాక్టర్ పి. జగదీష్ నాయుడు, డాక్టర్ పునీత్ సాయి పలువైద్య అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి మాట్లాడుతూ.. ఈ శిక్షణ తరగతులు గ్రామీణ వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన గాయత్రి విద్యా పరిషత్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ముగింపులో శిక్షణ పొందిన సభ్యులకు ధ్రువపత్రాలు అందజేశారు. సంఘం జోనల్ సలహాదారు కోన ప్రకాష్, జోనల్ సహాయ కార్యదర్శి కె.ఎన్. రావు, ఆనందపురం మండల అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు, మధురవాడ అధ్యక్షుడు కిరణ్ కుమార్, ప్రచార కార్యదర్శి పి. వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : శ్రీనివాస్, ఆనందపురం, విశాఖపట్నం.