ప్రారంభమైన మున్సి "పోల్ ".. బారులు తీరిన ఓటర్లు
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికలు ఏడు గంటలకు ఆరంభమయ్యాయి.. ఎస్డిపిఓ శ్రీనివాస్, సిఐ కంబగిరి రాముడు, రూరల్ సీఐ చిరంజీవి పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.. 6.50 నిమిషాల కల్లా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.. గుర్రపురులో పట్టణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అరగంట సమయంలోనే పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 41 వార్డులకు గాను 91 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.
A. R. శరత్ కుమార్
సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా