కాసేపట్లో మునిసి "పోల్స్ "
ఎమ్మిగనూరు,సూర్య ప్రతినిధి
మరో కొద్ది నిమిషాల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి.. కర్నూలు జిల్లాలోని కర్నూల్ నగరపాలక సంస్థతోపాటు ఆదోని ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు గూడూరు నగర పంచాయతీకి నేడు ఎన్నికలు జరగనున్నాయి.. నేటి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తాయని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటనలో వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగంగా జరుగు తున్న మున్సిపల్ ఎన్నికలు నేడు జరగను న్నాయి.. చేనేత పురం ఎమ్మిగనూరు పురపాలకం పరిదిలో 44 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. నేడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 84,939 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినుమేగించు కోనున్నారు. ఈ నేపద్యంలో ఎన్నికల అదికా రులు 91 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 8 సమస్యాత్మక పోలింగ్
సూచనలు అందిస్తున్న అధికారులు గంగిరెడ్డి శ్రీనివాసులు
కేంద్రాలుగాను, 11 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగ ఆగుర్తించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగిరెడ్డి వెల్లడించారు. 71 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సజావుగా జరుగుతుందనే ఆశాభావం వ్యక్తపరిచారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు పిఓ, ఏపిఓ లతోపాటు 545 మంది సిబ్బందిని వినియోగం చేసుకుంటున్నాం అన్నారు. నేడు జరిగే పోలింగ్లో 15 మంది పోలింగ్ అధికారులు, 28 మంది సమాయ
బ్యాలెట్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లున్న దృష్యం
అధికారులు, 5 మంది జోనల్ అధికారులు, 7 మంది రూట్ అధికారులు, ఇద్దరు మోడల్ కోడ్ అధికారులు, రెండు ప్లైయింగ్ టీంలు ద్వారా ఎన్నికలు సజావుగా జర పడం జరుగుతుందన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటలు తమ ఓటును నిర్భయంగా వేసుకోవాలని సూచించారు. 91 పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని గ్రహించి రాజకీయ నాయకులు గుంపులు కట్టుకుని తిరగడం మానుకోవాలన్నారు.
A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా