BREAKING
పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు * నెల్లూరు కిమ్స్‌లో రక్తదాన శిబిరానికి విశేష స్పందన

Select Suryaa Now
ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు  * నెల్లూరు కిమ్స్‌లో రక్తదాన శిబిరానికి విశేష స్పందన

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 
నెల్లూరు నగరంలోని దర్గామిట్ట కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. నవాబుపేటకు చెందిన 38 ఏళ్ల మర్లపాటి ప్రదీప్ పై సెప్టెంబర్ 24న గుర్తుతెలియని పదునైన వస్తువుతో దాడి జరగగా, గొంతుకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. స్థానిక జీజీహెచ్‌లో ప్రాథమిక చికిత్స, ఈటీ ట్యూబ్ అమర్చిన అనంతరం బాధితుడిని అత్యవసర స్థితిలో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరే సమయానికి రోగి అపస్మారక స్థితిలో ఉండి, బీపీ కూడా రికార్డు కాని విషమ పరిస్థితిలో ఉండటంతో ఎమర్జెన్సీ బృందం తక్షణమే ఆపరేషన్ థియేటర్‌కు తరలించింది. దాడిలో తెగిపోయిన అన్నవాహిక, శ్వాసనాళానికి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.బాధితుడు కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి సురక్షితంగా డిశ్చార్జ్ చేశారు.
ఈ క్లిష్టమైన కేసును విజయవంతంగా నిర్వహించిన సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ జగదీష్, ఎమర్జెన్సీ హెచ్‌ఓడీ డాక్టర్ వి. శివరామకృష్ణారెడ్డి, చీఫ్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ వి. జగదీష్, చీఫ్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ శేషయ్య, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ అవినాష్ రావుల వైద్య బృందాన్ని, నర్సింగ్ సిబ్బందిని యాజమాన్యం అభినందించింది.

మరోవైపు, జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో కిమ్స్ ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, ఆపదలో ఉన్న క్షతగాత్రులు, శస్త్రచికిత్స రోగుల ప్రాణాలు కాపాడేందుకు రక్తదానమే ఏకైక మార్గమని వైద్యులు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.

ఈ రక్తదాన శిబిరంలో ఆసుపత్రి వైద్య నిపుణులు, నర్సింగ్, పారామెడికల్, పరిపాలనా, సహాయక సిబ్బందితో పాటు రోగుల సహాయకులు కలిపి మొత్తం 97 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ రెండు విశేష సందర్భాల్లో సేవలందించిన వైద్య బృందాలను, రక్తదాతలను కిమ్స్ గ్రూప్ చైర్మన్  డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు, డైరెక్టర్ అద్విక్, రీజినల్ సీఓఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్ వంచి, యూనిట్ సీఓఓ డాక్టర్ రోహిణి ప్రియ లక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు.