BREAKING
టిడిపి కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ విశ్వకర్మలకు చేయూత.. పనిముట్ల పంపిణీ కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే: బండి సంజయ్ తీవ్ర విమర్శలు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పోలవరం నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరావు, ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు పబ్బు రాజుగౌడ్‌ కుటుంబానికి పరామర్శ శ్రీ వాసవి ఫార్మసీ కళాశాల విద్యార్థుల వీధి నాటక సందేశం. ఒంగోలు నియోజకవర్గంలో 193 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు మంజూరు ,పత్రాల పంపిణీ చేసిన శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్ ఇంటిపై సోలార్‌.. కరెంటు బిల్లుకు కోత. ,సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీఈ మల్లికార్జున్‌ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి : దిశ సమావేశంలో ఎంపీ డీకే అరుణ ప్రజల అవసరమే ప్రాధాన్యతగా.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి కృషి దోమ తహశీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యం..! స్వచ్ఛత స్పెషల్ క్యాంపియన్ -6 నో ప్రారంభించిన ఏరియా జిఎం వి కృష్ణయ్య తాగేటివారిపాలెం ఎస్ఎంసి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల జయకేతనం మెట్టు అగ్రి బిజినెస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

పోషణపై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి

Select Suryaa Now
పోషణపై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి

పామూరు, మేజర్ న్యూస్ : 

పామూరు మండలంలోని మోట్రావులపాడు అంగన్వాడీ కేంద్రంలో శనివారం 9వ జాతీయ పోషణ మాసంలో భాగంగా మన అంగన్వాడీ–మన బాధ్యత కార్యక్రమంలో అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఎంవీఎస్‌ పార్వతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పోషక పదార్థాలతో లోగోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పార్వతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను పోషణ, సంరక్షణ, చిన్నారుల ప్రాథమిక విద్యాభివృద్ధికి కేంద్రాలుగా తీర్చిదిద్దడంతో పాటు పోషణపై ప్రతి ఒక్కరిలో బాధ్యత జవాబుదారీతనం పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఎస్‌ఎన్‌పీ మెనూ చిన్నారుల విద్యాబోధన తొలి 1000 రోజుల ప్రాముఖ్యత, అభివృద్ధి ఆలస్యమైన పిల్లల గుర్తింపు, పీఎంఎంవీవై పథకం, ఏఐ స్క్రీనింగ్‌, ఏఎంసీ కమిటీల బాధ్యతలపై అవగాహన కల్పించారు. అనంతరం పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించి పోషకాహారంపై గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కె.సుబ్బలక్ష్మి, పి.బసవమ్మ, హెల్పర్‌ ఎ.రత్తమ్మతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు,చిన్నారులు పాల్గొన్నారు