BREAKING
యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్ ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్ వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు విజయవాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీక విజయవాడ ఉత్సవ్.. శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు

పోషకాహారంతోనే చిన్నారుల ఆరోగ్య వికాసం

Select Suryaa Now
పోషకాహారంతోనే చిన్నారుల ఆరోగ్య వికాసం

బాడంగి, సెప్టెంబర్ 28 (మేజర్ న్యూస్): బాడంగి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఎల్. సుజాత ఆదేశాల మేరకు మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం అంగన్వాడీ ఉత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులకు సమతుల్యమైన పోషకాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక వికాసానికి తోడ్పడవచ్చని ఈ సందర్భంగా తల్లులకు అవగాహన కల్పించారు.బాడంగి సెక్టార్ పరిధిలోని వీరసాగరం, పెద్దపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో సూపర్‌వైజర్ ఎస్.కె. గౌరమ్మ ఆధ్వర్యంలో, రామచంద్రపురం సెక్టార్‌లోని పిన్నవలస కేంద్రంలో సూపర్‌వైజర్ వై.వి. నాగమణి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. రేజేరు సెక్టార్ పరిధిలోని పాల్తేరు అంగన్వాడీ కేంద్రంలో సూపర్‌వైజర్ ఏ. శ్రీదేవి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారుల రోజువారీ ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా చేర్చాలని సూపర్‌వైజర్లు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని చిన్నారులకు సక్రమంగా అందించి సద్వినియోగం చేసుకోవాలని తల్లులకు అవగాహన కల్పించారు. పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణపై కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.