BREAKING
బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మిట్స్‌లో ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్,ఓపెన్ సైన్స్‌పై అవగాహన సదస్సు

పోషకాహారం, బాల్య ప్రేరణపై అవగాహన

Select Suryaa Now
పోషకాహారం, బాల్య ప్రేరణపై అవగాహన

వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్  తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. వెల్దుర్తి ప్రాజెక్ట్, రామళ్లకోట సెక్టార్‌ పరిధిలోని S.బోయినపల్లి, నరసాపురం, పిక్కినవానిపల్లి, లింగాలపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘అంగన్వాడీ ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించారు.

9వ జాతీయ పోషణ మాసోత్సవంలో భాగంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ కింద గర్భిణులు, బాలింతలు, మూడేళ్ల లోపు పిల్లలతో పాటు 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలపై గ్రామీణులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. బాల్య ప్రేరణ (ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్), పోషకాహార ప్రాధాన్యత గురించి వివరించారు.

తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు చిరుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే బలవర్ధక ఆహారాన్ని ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లలితమ్మ, జ్యోతి, మహేశ్వరి, వెంకటేశ్వరిలతో పాటు గ్రామాల్లోని తల్లులు, గర్భిణులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సూర్యా ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం