పొన్నూరు మండల బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా తాడిశెట్టి గోపి నియామకం
పొన్నూరు మండల బీజేపీ ఓబీసీ మోర్చ అధ్యక్షుడిగా కాసుకర్రు గ్రామానికి చెందిన తాడిశెట్టి గోపి నియమితులయ్యారు.
పొన్నూరు మండలం కాసుకర్రు గ్రామంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గోవాడ వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో, పూల కోటేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.గుంటూరు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎం. శేషగిరిరావు సహకారంతో ఈ నియామకం జరిగింది. నియామక పత్రాన్ని పూల కోటేశ్వరరావు చేతుల మీదుగా తాడిశెట్టి గోపికి అందజేశారు.ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన తాడిశెట్టి గోపిని నాయకులు, కార్యకర్తలు అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి పాటుపడతానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ గోవాడ వెంకటకృష్ణారావు, పూల సుబ్రహ్మణ్యం, ఆర్. వెంకట్రావు, ఆర్. హరిబాబు, వై. శ్రీనివాస గౌడ్, ఎం. రాఘవ, గురుబాబు, గంజేపల్లి సాంబశివరావు, వి. శ్రీనివాస్, కే. శ్రీనివాసరావు, సీహెచ్. నరసింహారావు, ఎన్. శ్రీనివాసరావు, డి. సామ్యూల్, కందుల సుబ్బారావు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :-- శిలార్