పోలమాంబ ఆలయంలో శాస్త్రోప్తంగా వరుణ యాగం
మక్కువ, అక్టోబర్ 6, (మేజర్ న్యూస్): పార్వతీపురం మన్యం, జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో వేంచేసియున్న శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయం వనం గుడిలో మంగళవారం వరుణ యాగం, వరుణ జపం శాస్త్రోత్తంగా నిర్వహించారు. శ్రీ పోలమాంబ అమ్మవారి వనం గుడిలో ఉదయం 6:54 గంటలకు
సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజల సంక్షేమం , శ్రేయస్సు కోరుతూ వరుణ దేవుని ఆశీస్సులను పొందుటకు వరుణ యాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు మేరకు వరుణ యాగం, వరుణ జపం నిర్వహించినట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి వివి సూర్యనారాయణ తెలిపారు. ముందుగా వనం గుడి అమ్మవారి ఆలయం మండపం నందు పచ్చని తోరణాలతో అలంకరించి, సింహాసనం పై శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తిని వేదమంత్రోచారణతో ఊరేగింపుగా తీసుకువచ్చి వేంచేసిఉంచారు. తదుపరి మండపారాధన, పుణ్యాహవాచనం, గణపతి పూజ, శివలింగం నకు రుద్రాభిషేకం, జలాభిషేకం, వరుణ జపం వరుణ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమం లను ప్రముఖ పండితులు విజయనగరం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కప్పగంతుల శ్రావణ్ కుమార్, తదితరులచే నిర్వహించారు. వరుణ యాగ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నైదాన చిన్న తిరుపతి, గ్రామ పెద్దలు పూడి దాలి నాయుడు, తీళ్ళ పోలినాయుడు, వసంతల భాస్కరరావు, అల్లు వెంకటరమణ, గొట్టావు కృష్ణమూర్తి, అఖ్యాన నర్సింగరావు, గొట్టాపు భవాని తీళ్ల శ్రీరాముల నాయుడు, గ్రంధి గున్నరాజు, ఆలయ ఆశాదిలు జన్ని పేకాపు రామారావు, జన్నిపేకపు భాస్కరరావు చొక్కాపు ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.