BREAKING
అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు

పోలమాంబ ఆలయ అభివృద్ధికి మరింత కృషి

Select Suryaa Now
పోలమాంబ ఆలయ అభివృద్ధికి మరింత కృషి


* 50 ఏళ్లలో జరగని ఆలయ అభివృద్ధి రెండేళ్లలో చేసాం
*భక్తులకు మెరుగైన సౌకర్యాలు
కల్పించేందుకు చర్యలు
*మంత్రి గుమ్మడి సంధ్యారాణి
*కార్యక్రమానికి హాజరుకాని గ్రామ టిడిపి సీనియర్ నాయకులు
*కార్యక్రమానికి హాజరైన వైసీపీ నాయకులు
మక్కువ, సెప్టెంబర్ 30, (మేజర్ న్యూస్):- 
ఉత్తంధ్రుల ఆరాధ్య దేవత శంబర శ్రీ పోలమాంబ ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని రాష్ట్ర స్త్రీ,శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  గుమ్మిడి. సంధ్యారాణి హామీ ఇచ్చారు. మండలంలోని శంబర గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న శ్రీ పోలమాంబ అమ్మవారి వనం గుడి ఆలయ అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత 50 ఏళ్లలో ఎన్నడూ జరగని ఆలయ అభివృద్ధి తాము అధికారం చేపట్టిన  రెండేళ్లలోనే శ్రీ శంబర పోలమాంబ ఆలయ అభివృద్ధి పనులు జరిపించామన్నారు. తాను మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ శంబర పోలమాంబ  ఆలయ అభివృద్ధికి మూడున్నర కోట్ల నిధులు మంజూరు చేయించి, క్యూ కాంప్లెక్స్ తో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తి చేయించానన్నారు. పోలమాంబ ఆలయ అభివృద్ధి పనులతో భక్తులకు మెరుగైన, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. శంబర శ్రీ పోలమాంబ ఆలయాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆలయ అభివృద్ధి పనులు ముందుకు సాగడం పై శంబర గ్రామ ప్రజలలో ఆనందం కనిపిస్తుంద న్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కార్యక్రమానికి గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు ఎవరు హాజరు కాక పోవడం విశేషం. కార్యక్రమంలో టిడీపి మండల అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాల నాయుడు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ నైదాన. చిన తిరుపతి, ఆలయ ఈవో వి.వి. సూర్యనారాయణ, మాజీ చైర్మన్ వసంతల భాస్కరరావు, గంజి కాశి నాయుడు తోపాటు వైసీపీకి చెందిన మాజీ చైర్మన్ పూడి దాలినాయుడు, అల్లు వెంకటరమణ, గ్రామ పెద్దలు గొట్టాపు కృష్ణమూర్తి తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.