పోగొట్టుకున్న సెల్ ఫోను అందజేత
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను ఆర్టీసి కంట్రోలర్ షేక్ బాబు ఇచ్చి నిజాయితిని చాటుకున్నారు. జె.పంగులూరు మండలం కోటపాడు గ్రామ రెవెన్యూ అధికారి యస్. శివరామిరెడ్డి బస్సుకోసం వచ్చి బస్టాండ్‌ఓ కూర్చొని తన ఫోనును బస్టాండ్‌లోని అరుగుపై ఉంచి మర్చిపోయి వెళ్ళిపోయారు. అది గమనించిన కంట్రోలర్ బాబు ఫోనును తీసుకొని తన వద్ద భద్రపరిచారు. శివరామిరెడ్డి పోగొట్టుకున్న ఫోనుకు ఫోను చేసి వివరాలు చెప్పటంతో కంట్రోలర్ బాబు వద్ద ఉన్న ఫోనును తిరిగి ఇచ్చి నిజాయితీని చాటుకున్నారు. దీంతో వి.ఆర్.ఓ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.