BREAKING
పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

 

 

జిల్లా ఎస్పీ తుషార్ డూడి

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చెప్పడం జరిగిందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు ప్రతినిధులకు మాత్రమే నామినేషన్ కేంద్రం లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ర్యాలీలు, ఊరేగింపులు, గుంపులుగా చేరడం, నినాదాలు చేయడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో 100 నుంచి 200 మీటర్ల పరిధిలో జనసమూహాలు గుమిగూడకుండా పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 బి ఎం ఎస్ ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.