BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల వాడకం దారులు పై భారీ జరిమానా

Select Suryaa Now
ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల వాడకం దారులు పై భారీ జరిమానా

బొబ్బిలి, సూర్య: బొబ్బిలి మున్సిపాలిటీ లో ప్లాస్టిక్ కవర్ లు, గ్లాసుల అమ్మకం దారులపై భారీ జరిమానా విధించడం జరుగుతుందిని మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి తెలిపారు. ఈ మేరకు కమిషనర్ శ్రీమతి ఎల్. రామలక్ష్మి ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో అన్ని సచివాలయాల వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలు మరియు పబ్లిక్ హెల్త్ మేస్త్రీలు  పాలిథిన్ మరియు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగిస్తున్నట్లు గా  గుర్తించారు.ఈ మేరకు పాత బొబ్బిలి, గొల్ల వీధి మరియు అప్పయ్యపేట ప్రాంతాలలో ఉన్న షాపులపై గత రెండు రోజులుగా నిర్వహించిన దాడులలో వాటర్ ప్యాకెట్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరియు పాలిథిన్ కవర్ లను గుర్తించి సీజ్ చేయుట జరిగినది. ఈ దాడుల్లో వాటర్ ప్యాకెట్ బస్తాలు మరియు డిస్పోజబుల్ గ్లాసులు వాడుతూ పట్టుబడిన వారిపై రూ.5,000/- లు వరకు జరిమానా విధించడం జరిగినది. ఇకపై పట్టణ పరిధిలో ఎవరైనా నిషేధిత ప్లాస్టిక్ మరియు పాలిథిన్లను వినియోగించినట్లయితే జరిమానా విధించుటయే కాకుండా కేసులు నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేయబడతాయని ఈ సందర్భంగా కమిషనర్ గారు తెలియజేశారు. 
ప్లాస్టిక్ నిషేధం విషయంలో దాదాపు 15 సంవత్సరాల చరిత్ర కలిగిన బొబ్బిలిలో ప్రజలే స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తిరస్కరించాలని ఈ సందర్భంగా కమిషనర్ కోరారు.