ఫ్యాన్ కు ఓటేస్తే చల్లగా ఉండొచ్చని.. ఫ్యాన్ ఎప్పుడు చల్లదనమే కలుగజే స్తుందని ఈ విషయాన్ని ప్రతి ఓటరు గమనించాలని వైఎస్ఆర్సిపి నేతలు పేర్కొన్నారు. కదిరి మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో భాగంగా కదిరి పట్టణంలోని నిజాంవలి కాలనీలో ఉన్న 15, 16 ,17 ,18, 19 వాటిల్లో వైఎస్ఆర్సిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్ కు మద్దతు గా వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ మక్బూల్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు పూల శ్రీనివాసులు రెడ్డి, సాదత్ అలీ ఖాన్, న్యాయవాది లింగాల లోకేశ్వర్ రెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా వార్డుల పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు కరపత్రాలు పంచుతూ.. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి చైర్మన్ అభ్యర్థి పర్వీన్.. వైసిపి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని నాయకులు కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదిరి పట్టణ అభివృద్ధి కోసం అధికం గా నిధులు కేటాయించాలని తెలియ జేశారు. గత మున్సిపల్ పాలక వర్గంలో అధికంగా నిధులను నిజాం వలి ప్రాంతానికి కేటాయించి ఇక్కడ వార్డుల అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగిందన్నారు. నవర త్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి అందించామని తెలియజేశారు. మళ్లీ వైసీపీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థి , వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్య కర్తలు, అభిమానులు పాల్గొన్న వారిలో ఉన్నారు.