BREAKING
ఏజెన్సీలో పోలీసుల విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలి:కరణం వెంకటేష్ బాబు

Select Suryaa Now
ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలి:కరణం వెంకటేష్ బాబు

ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలి:కరణం వెంకటేష్ బాబు

చీరాల 17వ వార్డులో వైఎస్సార్‌సీపీ విస్తృత ప్రచారం

డాక్టర్ ఇస్తర్ల షెర్లి, సలగల అమృతరావుతో కలిసి ఇంటింటి ప్రచారం

చీరాల: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని  చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ కరణం వెంకటేష్ బాబు ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాల 17వ వార్డులో ఆయన మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ ఇస్తర్ల షెర్లి, 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సలగల అమృతరావుతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చీరాల మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నాయకత్వంలో మున్సిపాలిటీకి నిధులు తీసుకువచ్చి ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ కృషి చేసిందని తెలిపారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ ఇస్తర్ల షెర్లి, 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సలగల అమృతరావును గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.