BREAKING
ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పరిశ్రమల సమన్వయం: సీఐఐ హిమాచల్ ప్రదేశ్ సదస్సు 3కె హెల్త్ వాక్‌ను విజయవంతం చేయండి.. VC క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జోన్ల వారీగా సమావేశాలు

ఫీల్డ్ అసిస్టెంట్ ల సమస్యలు పరిష్కరించాలి

Select Suryaa Now
ఫీల్డ్ అసిస్టెంట్ ల సమస్యలు పరిష్కరించాలి


చీపురుపల్లి మేజర్ న్యూస్: ఉపాధి హామీ పథకంలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంపీడీవో ఐ సురేష్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, మండల, డివిజన్ స్థాయిలో బదిలీలు చెయ్యాలని, విధి నిర్వహణలో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియో రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నగదు రహిత వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్నారు. విద్యార్హతలు ఉన్నవారికి పదోన్నతులు కల్పించాలని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అప్పలనాయుడు, సూర్యారావు, ధనలక్షి తదితరులు డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చినవారిలో క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.