పెనుగొండలో సర్పంచ్ అభ్యర్థి నౌడు దుర్గారావు ప్రచారం -- మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆశీస్సులతో వర్తక, వ్యాపార వర్గాల మద్దతు కోరుతూ విస్తృత పర్యటన
వాసవి పెనుగొండ, మేజర్ న్యూస్:పెనుగొండ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నౌడు దుర్గారావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆశీస్సులతో గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను, ఓటర్లను కలుసుకుంటున్నారు.
ప్రచార కార్యక్రమంలో భాగంగా పెనుగొండ ప్రధాన రహదారిపై ఉన్న వర్తక, వ్యాపార సంస్థలను సందర్శించి వ్యాపారులను, వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరితో మమేకమవుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలపై స్థానికులతో చర్చించారు.రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనను సర్పంచ్ అభ్యర్థిగా ఆదరించి, ఆశీర్వదించి విజయాన్ని అందించాలని నౌడు దుర్గారావు వ్యాపార వర్గాలకు, గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నౌడు దుర్గారావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పెనుగొండ ప్రధాన రహదారిపై సాగిన ఈ ప్రచారంతో గ్రామంలో ఎన్నికల సందడి మరింత ఊపందుకుంది.