పెనుబల్లి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోలిరెడ్డి సునీత ప్రకటన..
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : బుచ్చిరెడ్డిపాలెం మండలం సల్మాన్‌పురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలిరెడ్డి శేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి పోలిరెడ్డి సునీత ని పెనుబల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా ప్రకటించిన మాజీ మంత్రివర్యులు, వైసీపీ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. పార్టీ బలోపేతం, ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెనుబల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా పోలిరెడ్డి సునీత గారిని ప్రకటిస్తూ మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె అభ్యర్థిత్వంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు వైసీపీ సీనియర్ నాయకులు మల్లు జయరామిరెడ్డి, కోడూరు మధుసూదన్ రెడ్డి, మల్లు పెంచల రెడ్డి, మల్లు నరసింహారెడ్డి, భూమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి, సన్నపురెడ్డి తిరుపాల్ రెడ్డి, చలమల చెంచు రెడ్డి, దూర్నుతల సుధాకర్ రెడ్డి, నాగేళ్ల సాంబశివరెడ్డి, మారెళ్ళ పెంచల్ రెడ్డి, తుమ్మల మల్లికార్జున్ రెడ్డి, తుమ్మల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.